Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Aug-2016 13:01:53
facebook Twitter Googleplus
Photo

సౌతిండియన్ సినిమాలో ఎప్పటికప్పుడు ప్రయోగాత్మక సినిమాలతో మెప్పించే వారిలో హీరో విక్రమ్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన ?ఇరుముగన్? పేరుతో మరో ప్రయోగాత్మక సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. తెలుగులో ?ఇంకొక్కడు? పేరుతో డబ్ అవుతోన్న ఈ సినిమా తమిళ వర్షన్‌కు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక తెలుగు వర్షన్ సెన్సార్ కూడా మరో రెండు రోజుల్లో పూర్తవుతుందని, సెప్టెంబర్ 8న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున సినిమా విడుదల కానుందని టీమ్ తెలిపింది.
సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్ రెండు విభిన్న పాత్రలతో అలరించనున్నారు. ముఖ్యంగా లవ్ అనే పాత్ర సినిమాకే హైలైట్‍గా నిలుస్తుందని ప్రచారం జరుగుతోంది. విక్రమ్ సరసన నయనతార, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలూ పూర్తవడంతో టీం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

,  ,  ,  ,  ,