Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jul-2015 15:19:46
facebook Twitter Googleplus
Photo


పుకారు మంచిదేననీ .. అది సినిమా, సినిమాకి మధ్య గ్యాప్ లో ప్రేక్షకులు తమని మరిచిపోకుండా చేస్తూ ఉంటుందని ఆర్య అంటున్నాడు. తాజాగా ఆయన నటించిన ఓ తమిళ చిత్రం టీజర్ ని యూ ట్యూబ్ లో రిలీజ్ చేయగా దానికి అనూహ్యమైన స్థాయిలో స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై వస్తోన్న పుకార్ల గురించి కూడా ప్రస్తావించాడు.

కథానాయికలతో తాను చాలా చనువుగా ఉంటాననీ, వాళ్ల వ్యక్తిగత విషయాల్లోను పాలుపంచుకుంటానని జరుగుతున్న ప్రచారం నిజమేనని ఆయన అన్నాడు. తాను అందరితోను కలివిడిగా వుంటానని, ఇతరుల సాధక బాధకాలను పంచుకుంటాను గాని ప్లే బాయ్ ని మాత్రం కాదని చెప్పాడు. కథానాయికలతో తాను స్నేహంగా ఉండటాన్ని కొంతమంది తమకి తోచిన విధంగా ప్రచారం చేస్తూ ఉంటారనీ, ఆ పుకార్లని తాను ఆస్వాదిస్తానని అన్నాడు. ఎందుకంటే తారలను ప్రేక్షకులు మరిచిపోకుండా ఉండడానికి అప్పుడప్పుడు ఇలాంటి పుకార్లు ఉపయోగపడుతూ ఉంటాయంటూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

,  ,  ,