Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-May-2016 11:15:14
facebook Twitter Googleplus
Photo

కొరటాల శివ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'జనతా గ్యారేజ్' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం హైద్రాబాద్ లో యంగ్ టైగర్ పై ప్రధాన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకూ జూనియర్ సమంతలపై సన్నివేశాలను షూట్ చేయగా.. ప్రస్తుతం శామ్స్ కొంత బ్రేక్ తీసుకుంది. సమంత నటించిన సినిమాలు వరుసగా రిలీజ్ లు ఉండడంతో.. చెన్నై అమ్మడికి బ్రేక్ తీసుకోక తప్పలేదు. ఈ టైంలో మలయాళ కుట్టి వచ్చి ఎన్టీఆర్ తో జత కట్టేసింది.

జనతా గ్యారేజ్ లో నిత్యా మీనన్ రెండో హీరోయిన్ గా నటిస్తున్నా.. ఈ భామ ఇప్పుడే షూటింగ్ లో పాలుపంచుకుంది. నిత్యా లాంటి ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ తో తొలిసారి నటించడంపై ఎన్టీఆర్ కూడా సంతోషంగా ఉన్నాడని అంటున్నారు. రీసెంట్ గా విడుదలైన సూర్య మూవీ 24లో కూడా నిత్యమీనన్ పాత్రకు బోలెడన్ని ప్రశంసలు వస్తున్నాయి.

తొలిసారిగా నిత్యతో నటిస్తున్న ఎన్టీఆర్.. ఆమె పెర్ఫామెన్స్ చూసి థ్రిల్ అయ్యాడని అంటున్నారు. మరికొన్ని సన్నివేశాల చిత్రీకరించిన తర్వాత.. మే 20న విడుదల చేయనున్న ఫస్ట్ లుక్ పై ఎన్టీఆర్ దృష్టి పెడతాడని తెలుస్తోంది. రీసెంట్ గా ఎన్టీఆర్ కి జూనియర్ అయిన అభయ్ కూడా జనతా గ్యారేజ్ సెట్ లో సందడి చేసిన విషయం తెలిసిందే.

,  ,  ,  ,  ,  ,