Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Mar-2017 12:21:19
facebook Twitter Googleplus
Photo

నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ ల కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం ఈరోజు కూకట్ పల్లిలో పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. సీనియర్ దర్శకులైన ఎస్వీ కృష్ణా రెడ్డి, కోందండరామి రెడ్డిలతో పాటు బోయపాటి శ్రీను, క్రిష్ లు కార్యక్రమానికి హాజరు కాగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి బాలకృష్ణ పై క్లాప్ ఇచ్చి సినిమాని ప్రారంబించారు.
100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత బాలకృష్ణ చేస్తున్న చిత్రం, కావడం ఎవరూ ఊహించని విధంగా పూరి దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచానాలున్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారు, ఇతర నటీనటులెవరు, సినిమా కథ ఎలా ఉండబోతోంది అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి

,  ,  ,  ,  ,