Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Nov-2016 11:33:59
facebook Twitter Googleplus
Photo

సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఇండియాకి వచ్చేశారు. హెల్త్ చెకప్స్ కోసం అమెరికా వెళ్లిన ఆయన.. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉండడంతో.. మరి కొన్ని రోజుల్లోనే రోబో సీక్వెల్ గా రూపొందుతున్న 2.0 షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఇప్పుడీ మూవీపై ఓ షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది.

2.0 చిత్రంలో కేవలం ఒకే ఒక్క పాట ఉంటుందని తెలుస్తోంది. ఇంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఓ ఇండియన్ మూవీలో కేవలం ఒకే ఒక్క పాట అంటే.. శంకర్ రాసుకున్న స్క్రిప్ట్ ఎంత గ్రిప్పింగ్ గా ఉండనుందో అర్ధమవుతుంది. అలాగే ఈ సింగిల్ సాంగ్ కి కూడా ఇప్పటికే షూటింగ్ పూర్తయిపోయిందట. ఉక్రెయిన్ లో అనేక అందమైన ప్రాంతాల్లో ఈ రొమాంటిక్ డ్యుయెట్ ను షూట్ చేయగా.. ఇందులో రజినీకి తోడుగా అమీ జాక్సన్ ఆడి పాడింది. అయితే.. 2.0 ఆల్బమ్ లో మాత్రం 5 నుంచి 6 పాటలు ఉంటాయని.. కానీ ఇవన్నీ సినిమాలో భాగంగా వచ్చి వెళ్లిపోతుంటాయ్ తప్ప.. వేరే సాంగ్ షూటింగ్ ఉండదని చెబుతున్నారు.

శంకర్ డైరెక్షన్ లో ఏఆర్ రెహమాన్ అందిస్తున్న సంగీతం.. రోబో 2.0కు ప్రధాన ఆకర్షణ కానుండగా.. అక్షయ్ కుమార్ తమిళ అరంగేట్రం చేస్తుండడం విశేషం. నవంబర్ 20న 2.0 ఫస్ట్ లుక్ ను రివీల్ చేయనున్నాడు దర్శకుడు శంకర్.

,  ,  ,  ,  ,