Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Feb-2017 10:49:39
facebook Twitter Googleplus
Photo

చాలా కాలంగా మనోడు కొట్టిన ట్యూన్లనే అటూ మార్చి కొట్టేస్తున్నాడనే అపవాదును ఎదుర్కొంటున్నాడు. అయినాసరే వాటన్నింటిని అధిగమించి ఈసారి మాత్రం తన ట్యూన్లతో భారీగా ఇంప్రెస్ చేయాలని డిసైడైనట్లున్నాడు తమన్. అందుకే కాస్త గ్యాప్ తీసుకుని.. సాయిధరమ్ తేజ్ ''విన్నర్'' సినిమాతో తన టాలెంట్ చూపించడానికి రంగంలోకి దిగాడు.

ఈ సినిమాలోని సితార సితార పాటను గత సాయంత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట వినగానే ఏదో స్సెషల్ గా ఉందే అనిపించక మానదు. ముఖ్యంగా ఫ్లూట్ బిట్ తో ఈ పాటను తమన్ ఓపెన్ చేసిన తీరు ఒకెత్తు అయితే.. ఆ తరువాత డ్రమ్స్ బీట్ ను కూడా ఇంట్రెస్టింగ్ గా కొట్టాడు. తిరిగి మరోసారి వింటేజ్ ''కిక్'' సినిమా తమన్ ''ఓ సితార సితార.. నిన్న మొన్న నేను ఆవారా.. ప్రేమ పంచుకోవే మనసారా'' అంటూ సాగే ఈ లిరిక్స్ కూడా బాగున్నాయి. మొత్తంగా మెస్మరైజింగ్ గా ఉన్న ఈ పాట ఒక ఊపు ఊపేయడం ఖాయంగానే ఉంది.

డాన్ శీను వంటి సినిమాలను తీసిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో విన్నర్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. సాయిధరమ్ తేజ్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్.

,  ,  ,  ,  ,