Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jan-2015 10:33:55
facebook Twitter Googleplus
Photo

తనలా తెరపై ఎలా కనిపించాలో ఇమ్రాన్ హష్మీకి ప్రస్తుతం తర్ఫీదు ఇస్తున్నాడు ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్. ఇమ్రాన్ హీరోగా దర్శకుడు టోనీ డిసౌజా తాజాగా అజార్ జీవితకథను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇప్పుడు ఈ బాలీవుడ్ నటుడు అజార్ వెంటపడుతున్నాడు. అతను ముంబయ్ వస్తే పరుగులు పెడుతున్నాడు. ఒకవేళ అజార్ ఢిల్లీ వెళితే, అతని వెంట అక్కడికి వెళుతున్నాడు. నిత్యం అతన్ని, అతని బాడీ లాంగ్వేజ్ నీ పరిశీలిస్తూ, అతని సమక్షంలో క్రికెట్ గ్రౌండులో ఆటలో నైపుణ్యం కూడా పెంచుకుంటున్నాడు. "ప్రస్తుతం మన మధ్య వున్న ఓ ప్రముఖ వ్యక్తిలా నటించడం అంటే మాటలు కాదు. అందుకే ఇమ్రాన్ ని అజార్ వెంట ట్రైనింగు కి పంపించాం" అంటున్నాడు దర్శకుడు డిసౌజా.

,  ,  ,  ,