Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Apr-2017 11:01:21
facebook Twitter Googleplus
Photo

బాహుబలిః ది కంక్లూజన్’కు సంబంధించి మొదట్లో రిలీజ్ చేసిన ప్రభాస్.. రానాల పోస్టర్లు అంచనాల్ని అందుకోలేకపోయాయి. కానీ ఆ తర్వాత వస్తున్న పోస్టర్లు మాత్రం ఒకదాన్ని మించి ఒకటి మించి పోతున్నాయి. ప్రి రిలీజ్ ఈవెంట్ ముందు ఏనుగెక్కుతున్న బాహుబలి పోస్టర్ ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. ఈ మధ్యే బాహుబలి-2 విడుదల నెలలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో లాంచ్ చేసిన భల్లాలదేవుడి పోస్టర్ కూడా అలాంటి రెస్పాన్సే తెచ్చుకుంది.

ఇప్పుడు బాహుబలి కత్తి దూస్తున్న కొత్త పోస్టర్ కూడా వావ్ అనిపిస్తోంది. బ్యాగ్రౌండ్లో సూర్యుడి వెలుగులో మాహిష్మతి సామ్రాజ్యం మెరిసిపోతుండగా.. ప్రభాస్ కదన రంగానికి సన్నద్ధమవుతున్నట్లుగా ఉంది ఈ పోస్టర్ థీమ్ చూస్తుంటే. విడుదలకు ఇంకో మూడు వారాలు కూడా సమయం లేని నేపథ్యంలో సినిమాపై హైప్ మరింత పెంచాలన్న ఉద్దేశంతో ఇలా పోస్టర్లు రిలీజ్ చేస్తున్నట్లుంది బాహుబలి టీం. రాబోయే రోజుల్లో మరిన్ని పోస్టర్లు ఇలాంటివే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు నిర్మాతలు. ఆదివారం బాహుబలిః ది కంక్లూజన్ తమిళ వెర్షన్ ఆడియో వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది.

,  ,  ,  ,  ,