Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-May-2017 10:30:16
facebook Twitter Googleplus
Photo

బాహుబలి 2 విడుదల అయింది. డైరెక్టర్ రాజమౌళికి ఆ టీమ్ ని అన్నింటా భ్రమ్మరధం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళిన ఏ ఇంటర్వ్యూ చూసినా అందరూ మాట్లాడేది ఆయన గురించే. ఆ సినిమా లో పనిచేసిన ప్రభాస్ రానా అనుష్క రమ్యకృష్ణ అందరూ అతని తరువాతే ఎవరైనా అనే ఒక అభిప్రాయం ఉంది. ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు మరి సోషల్ మీడియా ఒకటి ఉంది కదా దాన్ని ఎఫెక్ట్ మన తెలుగు సూపర్ స్టార్స్ పైన్ ఎలా పడిందో చూడండి.

బాహుబలి 2 విడుదల తరువాత చాలామంది స్టార్స్ నిర్మాతలు దర్శకులు శుభాకాంక్షలు ట్విటర్ల ద్వారా చెప్పారు. అందరూ రాజమౌళినే గొప్ప అని చెప్పారు. అక్కడక్కడ ప్రభాస్.. రానా.. అనుష్కల గురించి ప్రస్తావించారు. మన హీరోలు మహేశ్ ఇంకా ఎన్టీఆర్ కూడా అదే చేశారు. మహేశ్ ట్వీట్ చేస్తూ బాహుబలి 2 లో రాజమౌళి కథని చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది ఈ సినిమా తో ఆయన ఇండియన్ సినిమా గేమ్ చేంజ్ చేశారు అని అన్నాడు. ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ రాజమౌళి ఇండియన్ సినిమాని మరో మెట్టు పైకి తీసుకెళ్లారు అని చెప్పాడు.

ఇందూలో తప్పు ఏమి ఉంది అని అనుకోవచ్చు.. కాని కొందరు మాత్రం.. ప్రభాస్ ను పొగడకుండా కేవలం రాజమౌళినే పొగుడుతున్నారేంటి అంటే ఇప్పుడు ఎద్దేవా చేస్తున్నారు. ఎన్టీఆర్ ట్వీట్లో ప్రభాస్ ను అందరితో కలిపేశాడని.. మహేష్ అసలు రాజమౌళి తప్పించి ఎవ్వరి గురించి చెప్పలేదని.. ఇప్పుడు బాహుబలి అభిమానులు కొందరు కామెంట్లు చేస్తున్నారు.

,  ,  ,  ,  ,