Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jul-2016 10:30:19
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ మహేష్, పాపులర్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమా సెట్స్‌పైకి వెళ్ళేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. సౌతిండియన్ సినిమాల్లో టాప్ హీరో, డైరెక్టర్స్‌లలో ఒకరైన వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా కావడంతో సెట్స్‌పైకి వెళ్ళకముందు నుంచే ఈ సినిమాపై అంచనాలు బయలుదేరాయి. ఇక తన గత చిత్రం ?బ్రహ్మోత్సవం? బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడంతో మహేష్ కూడా ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళబోతోంది.
మహేష్ ఇంట్రో సాంగ్‌తో సినిమా షూటింగ్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ తమిళ వర్షన్‌కు ప్రముఖ రచయిత మదన్ కర్కి సాహిత్యం సమకూర్చారు. గతంలో కర్కి ?బాహుబలి? సినిమాకు సాహిత్యం అందించడంతో పాటు ఆ సినిమాలో వాడిన ?కిలికి? అనే భాషను కూడా కనిపెట్టారు. ఎంతో పేరు గడించారు. ఇక మహేష్ సినిమాకు పనిచేయడం సంతోషంగా ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. హరీస్ జైరాజ్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో సుమారు 80 కోట్ల భారీ బడ్జెట్‌తో ఠాగూర్ మధు, ఎన్.వి.ప్రసాద్‌లు నిర్మిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,