Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-May-2017 10:51:50
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్ నుండి విక్కీ డోనర్ తెచ్చాం. ఆ సినిమా అక్కడ సూపర్ డూపర్ హిట్. ఆ రేంజులో సక్సెస్ అవుతుందని ఎవ్వరూ అసలు ఊహించనలేదు. అలాగే కోలీవుడ్ లో సూదు కవ్వుమ్ బంపర్ హిట్. ఒక కిడ్నాప్ కథ అంత పెద్ద సక్సెస్ కొడుతుందని కల్లలో కూడా వారు అనుకోలేదట. అలాగే తమిళంలో వీరం ఇంకా పెద్ద హిట్. కత్తి సినిమా కూడా సూపర్ హిట్. ఇక మలయాళంలో ప్రేమమ్ డూపర్ సూపర్ బ్లాక్ బస్టర్. ఇంతకీ ఇవన్నీ ఎందుకిప్పుడు అనేగా మీ సందేహం?

ఈ సినిమాలన్నీ తెలుగులో వచ్చేశాయి. కాకపోతే అన్నీ ఆడలేదు. కత్తి సినిమా మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150గా వచ్చి రికార్డులు బద్దలు కొడితే.. ప్రేమమ్ అదే పేరుతో వచ్చేసి నాగచైతన్యకు తొలి బిగ్ సోలో హిట్ అందించింది. కాని మిగతా రీమేకులు ఉన్నాయి చూశారూ.. అన్ని డిజాష్టర్లే. సుమంత్ డోనరుడు.. రాజశేఖర్ గడ్డం గ్యాంగ్.. పవన్ కళ్యాణ్ కాటమరాయుడు.. అసలు యావరేజ్ గా కూడా ఆడలేదు. ఇప్పుడు వీటి సరసన చాలా తేలికగా జాయిన్ అయిపోయింది.. బాబు బాగా బిజీ. హిందీలో హంటర్ సినిమా స్లీపర్ హిట్ అయితే.. తెలుగులో ఈ సినిమా మాత్రం కొంచెం కూడా ఇంప్రెస్ చేయలేకపోయింది. ట్రేడ్ వర్గాల్లో ఉన్న టాక్ ను బట్టి చూస్తుంటే.. సినిమా ఔట్ అనే చెప్పాలి.

ఏంటో మన దర్శకులు.. అసలు హిట్టయినా రీమేక్ ను ఎంచుకోవడం.. దానిని సరిగ్గా రీమేక్ చేయలేక సతమతమవడం.

,  ,  ,  ,  ,