Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Jun-2016 16:00:41
facebook Twitter Googleplus
Photo

విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తోన్న ?బాబు బంగారం? సినిమా కొద్దికాలంగా తెలుగులో మంచి ఆసక్తి కనబరుస్తూ వస్తోన్న సినిమాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ?భలే భలే మగాడివోయ్? లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న కామెడీ సినిమా కావడం వల్ల కూడా ?బాబు బంగారం?కు మంచి క్రేజ్ ఉంది. ఇక ఇప్పటికే ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా, చివరి షెడ్యూల్‌ను చెన్నైలో పూర్తి చేయనుంది.
జూలై మొదటివారంలో ఐదురోజుల పాటు జరగనున్న ఓ పాట షూటింగ్‌తో సినిమా మొత్తం పూర్తవుతుంది. వెంకటేష్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్‍టైన్‌మెంట్స్ నిర్మించింది. గిబ్రాన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో జూలై 9న విడుదల కానుండగా, సినిమా జూలై 29న విడుదల కానుంది. వెంకటేష్ ఓ కామెడీ పోలీసాఫీసర్‌గా నటించిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ అన్నీ పాజిటివ్ వైబ్రేషన్స్ తెచ్చిపెట్టాయి.

,  ,  ,  ,  ,  ,