Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Dec-2017 11:01:42
facebook Twitter Googleplus
Photo

రామ్ చరణ్ ఫాన్స్ మాత్రం ఎప్పుడెప్పుడు ఈ మూడు నెలలు గడిచిపోతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ధృవ విడుదలై ఏడాది దాటిపోయింది. రంగస్థలం విడుదల టైంకి మరో మూడు నెలలు యాడ్ అవుతాయి. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు అవుతున్నా పట్టుమని పది సినిమాలు చేయడానికే నానా కష్టాలు పడుతున్న చరణ్ ఇలాగే కంటిన్యూ అయితే కనక పాతిక సినిమాలు చేసే లోపు ఇప్పుడున్న బాబాయ్ పవన్ కళ్యాణ్ వయసు కూడా దాటిపోతాడు. అందుకే ఈ సారి అలాంటి పొరపాటు జరగకుండా బోయపాటి శీను సినిమా - రాజమౌళి మల్టీ స్టారర్ సినిమా కోసం పక్కా ప్లానింగ్ తో ఉన్నాడట. ఇక రంగస్థలం గురించి రకరకాల కథలు ప్రచారంలోకి వస్తున్నాయి. అవి నిజమో కాదో సుకుమార్ కే తెలుసు. కాని విన్న మెగా ఫాన్స్ మాత్రం వాటిని ఊహించుకుంటూ ఊహలలో తేలుతున్నారు.

దీని ప్రకారం రంగస్థలం పూర్తిగా పల్లెటూరి రాజకీయాల నేపధ్యంలో సాగే కథ. రంగస్థలం అనేది గ్రామం పేరు. ఆ ఊళ్ళో ఇద్దరు భూస్వాములు జగపతి బాబు - ప్రకాష్ రాజ్. ఆధిపత్యం కోసం నిత్యం గొడవ పడుతూ ఉంటారు.చిట్టిబాబు అలియాస్ చరణ్ అక్కడ బోటు నడుపుతూ పబ్బం గడుపుతూ ఉంటాడు. ఆ ఇద్దరిలో ఒకరికి విశ్వాసపాత్రుడిగా ఉంటాడు. ఊరందరికీ తలలో నాలిక లాంటి వాడు. గేదెలు కాసుకునే మహాలక్ష్మి అలియాస్ సమంతాను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. చిట్టిబాబు అన్నయ్య ఆది పినిశెట్టి రాజకీయ జూదంలో ఇరుక్కుని చిట్టుబాబు పనిచేసే భూస్వామికి వ్యతిరేకంగా ప్రెసిడెంట్ పోటీకి నిలబడతాడు. ఇక అక్కడి నుంచి నాటకీయ పరిణామాలు జరుగుతాయి. ఊరిని - అన్నయ్యని కాపాడే బాధ్యత చిట్టిబాబు మీద పడుతుంది. మరి వీటి నుంచి ఎలా బయట పడి తన మహాలక్ష్మిని గెలుచుకున్నాడు అనేది రంగస్థలం కథ అని ఫిలిం నగర్ లో చర్చ జరుగుతోంది. ఇది నిజమో కాదో కాని మెగా ఫాన్స్ మాత్రం చాలా కాలం తర్వాత టెక్నాలజీకి దూరంగా ఉండే విలేజ్ పాలిటిక్స్ సినిమా కాబట్టి మాస్ కి కిక్కిచ్చేలా ఉంటుందని సంబర పడుతున్నారు.

,  ,  ,  ,  ,