భలే భలే మగాడివోయ్ చిత్రం తో మారుతీ మార్కెట్ ఓవర్సీస్ లో బాగా పెరిగిపోయింది. దీంతో తన తాజా చిత్రం బాబు బంగారం చిత్రాన్ని ఏకంగా 5 కోట్లకు బయ్యర్లు కొనుగోలు చేసారు. అయితే సినిమా టాక్ పర్వాలేదు అని వచ్చిన కానీ వసూళ్లు మాత్రం అంతగా రాబట్టలేకపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారానికి బాగానే వసూళ్లు వచ్చేయి కానీ ఓవర్సీస్ లో మాత్రం గట్టి దెబ్బ తగిలింది. మొదటివారం పూర్తి నాటికీ 400000 డాలర్లను మాత్రమే వసూలు చేసిన బాబు బంగారం, హాఫ్ మిలియన్ మార్క్ ను కూడా టచ్ చేయలేకపోయింది. దీంతో కొన్న బయ్యర్లకు 1.5 కోట్లు వచ్చాయన్నమాట. మరి మిగతా మొత్తం ఎప్పుడు వస్తుందో మీరే అర్ధం చేసుకోండి. మారుతీ ని నమ్ముకొని 5 కోట్లు పెట్టినవారికి , సగం పెట్టుబడి కూడా రాకపోగా 3.5 కోట్లు అదనంగా లాస్ అని చెప్పాలి. ఫైనల్ గా చెప్పాలంటే ఓవర్సీస్ లో బంగారం కొన్నోళ్లకు ఇత్తడైపోయింది అన్నమాట.