Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-May-2017 11:23:29
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు కొత్త సినిమా కొరటాల శివతో చేస్తున్నాడన్నది ఇప్పడు అధికారికమే. ఈ మూవీ షూటింగ్ కి సంబంధించి పర్ఫెక్ట్ షెడ్యూల్ ఉందని.. సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లోన సినిమా రిలీజ్ చేసేస్తామని.. ఇప్పటికే చెప్పేశాడు కొరటాల. అయితే.. సూపర్ స్టార్ లేటెస్ట్ మూవీ స్పైడర్ సంగతే ఇంకా తేలలేదు.

ఇప్పటికే షూటింగ్ చివరి దశకు వచ్చినా.. ఇంకా రెండు పాటలు తీయాల్సి ఉంది. అవి కంప్లీట్ చేసినా రిలీజ్ ఎప్పుడో అన్న సంగతి మురుగదాస్ కే అంతుపట్టడం లేదు. దీంతో మహేష్ ఫ్యాన్స్ మహా నిరాశలో ఉన్నారు. అంతకంతకూ మూవీ రిలీజ్ వాయిదా పడుతుండడంతో దర్శకుడిపై నేరుగానే ట్విట్టర్ లో నిప్పులు చెరుగుతున్నారు. మహేష్ ఫ్యాన్స్ ను శాంతపరిచేందుకు ఇప్పుడు ఓ స్పెషల్ టీజర్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా దీన్ని రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.

సినిమా స్టోరీ లైన్ ఏ మాత్రం లీక్ కాకుండా.. కంప్లీట్ గా మహేష్ ను స్టైల్ ను.. మ్యానరిజమ్స్ ను మాత్రమే చూపిస్తూ.. ఒకట్రెండు డైలాగ్స్ తో కట్ చేసిన ఈ ట్రైలర్ సూపర్బ్ గా వచ్చిందని తెలుస్తోంది. ఈ ఒక్క టీజర్ తో మహేష్ ఫ్యాన్స్ ను కొంత కాలం పాటు కంట్రోల్ చేయవచ్చని మురుగ ఆలోచిస్తున్నాడట. పైగా తండ్రి పుట్టిన రోజున సినిమాకి సంబంధించి ఏదో ఒక అప్ డేట్ రిలీజ్ చేయడం మహేష్ కు సెంటిమెంట్ కూడా

,  ,  ,  ,  ,