Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Aug-2016 17:11:26
facebook Twitter Googleplus
Photo

విక్టరీ వెంకటేష్, ?భలే భలే మగాడివోయ్‌?తో టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయిన మారుతిల కాంబినేషన్‌లో ?బాబు బంగారం? అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. టీజర్‌, ట్రైలర్‌తో విపరీతమైన అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా నేటితో సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని పక్కాగా విడుదలకు సిద్ధమైపోయింది. సెన్సార్ బృందం ఈ సినిమాకు ?యూ/ఏ? సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక దీంతో ఆగష్టు 12న సినిమా విడుదలకు అంతా పక్కాగా సిద్ధమైపోయింది.
వెంకటేష్ ఓ కామెడీ పోలీసాఫీసర్‌గా కనిపించనున్న ఈ సినిమాకు ఆయన స్టైల్ కామెడీయే మేజర్ హైలైట్‌గా నిలుస్తుందన్న ప్రచారం జరుగుతోంది.
గిబ్రాన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోకు కూడా మంచి స్పందనే వస్తోంది. వెంకటేష్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది.

,  ,  ,  ,  ,