Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Jul-2016 15:50:43
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు గౌతమ్ మీనన్, హీరో నాగచైతన్యల కాంబినేషన్‌లో ?సాహసం శ్వాసగా సాగిపో? అన్న సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. టీజర్, ఆడియోతో విపరీతమైన అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా చాలాకాలంగా ఓ సరైన విడుదల తేదీ కోసం ఎదురుచూస్తోంది. మొదట జూలై 15నే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని దర్శకుడు గౌతమ్ మీనన్ స్వయంగా ప్రకటించినా, ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. కొద్దిరోజుల క్రితం ఆగష్టులో సినిమా విడుదలవుతుందని ప్రకటించిన గౌతమ్ మీనన్, తాజాగా ఆగష్టు 19వ తేదీని దాదాపుగా ఖరారు చేశారు.
ఇక ఈ విడుదల తేదీలో ఎలాంటి మార్పులూ ఉండబోవని గౌతమ్ మీనన్ టీమ్ దగ్గర్నుంచి సమాచారం. గౌతమ్ మీనన్ ? నాగ చైతన్య ? ఏ.ఆర్.రహమాన్‌ల కాంబినేషన్‍లో ?ఏ మాయ చేసావే? లాంటి క్లాసిక్ హిట్ తర్వాత వస్తోన్న సినిమా కావడం ?సాహసం శ్వాసగా సాగిపో?కు ప్రత్యేకత తెచ్చిపెట్టింది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ వర్షన్‌లో శింబు హీరోగా నటించారు. ఇక నాగ చైతన్య నటించిన మరో సినిమా ప్రేమమ్ సెప్టెంబర్ నెలలో విడుదల కానుంది.

,  ,  ,  ,  ,  ,  ,