Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Feb-2016 15:44:31
facebook Twitter Googleplus
Photo

విన‌డానికి విడ్డూరంగా అనిపిస్తోందా? అయినా ఇది నిజం అంటున్నారు టాలీవుడ్ బ‌డా విల‌న్‌, హీరో జ‌గ‌ప‌తిబాబు. రీసెంట్‌గా ఆయ‌న ఓ ఇంట‌ర్‌వ్యూ ఇచ్చారు. ఈ ఇంట‌ర్‌వ్యూలో ఆయ‌న షేర్ చేసుకున్న విష‌యాలు హాట్ టాపిక్‌గా మారాయి. త‌న కూతురి మ్యారేజ్‌ని త‌న సొంత కుల‌స్తులే ఆప‌డానికి ప్ర‌య‌త్నించారని చెప్పారు.

జ‌గ‌ప‌తిబాబుకి ఇద్ద‌రు కూతుళ్లు. పెద్ద కూతురు ఓ అమెరిక‌న్‌ని పెళ్లాడింది. క‌మ్మ కుల‌స్తురాల‌యిన అమ్మాయి.. ఓ అమెరిక‌న్‌ని పెళ్లిచేసుకోవ‌డం ఏంటంటూ కాబోయే అల్లుడిపై అమెరిక‌న్ ఎంబ‌సీలో కేసు ఫైల్‌చేయ‌డానికి కూడా రెడీ అయ్యార‌ట‌. దీంతో, విష‌యం ఆయ‌న దాకా రావ‌డంతో వెంట‌నే అలెర్ట‌యిన జ‌గ‌ప‌తి బాబు.. వారిని బ‌తిమలాడుకొని కేసు లేకుండా చూసుకున్నారట‌. ఇది ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దూ. అయితే, మీరే వినండి. జ‌గ‌ప‌తిబాబు హీరోగానే కాదు.. మ‌నిషిగా కూడా విశాల భావాలున్న వ్య‌క్తి అని ప్రూవ్ చేసుకున్నాడు. మ‌త‌, కుల‌, జాతి, ప్రాంతీయ బేధాలు లేకుండా మ‌నిషిగా ఎద‌గాల‌నేది త‌న ఫిలాస‌ఫీ అన్నాడు జ‌గ‌ప‌తిబాబు.

,  ,  ,  ,