Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Mar-2017 15:20:09
facebook Twitter Googleplus
Photo

రెండో బాహుబలి ట్రైలర్ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. వరల్డ్లోనే టాప్ వ్యూస్ సొంతం చేసుకొన్న కొన్ని ట్రైలర్లలో ఇదొకటిగా నిలిచింది. ఇండియాలో అయితే నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకొంది. ఇప్పటిదాకా భారతీయ సినిమాలకి సంబంధించిన ఏ ట్రైలర్ నీ చూడని విధంగా దీన్ని చూశారు ప్రేక్షకులు. ఆ రెస్పాన్స్ చూసి బాహుబలి టీమ్ సైతం ఆశ్చర్యపోతోంది. అయితే కేవలం 140 సెకన్ల నిడివిగల ఈ ట్రైలర్ కోసం రాజమౌళి టీమ్ రెండు నెలలపాటు కష్టపడిందట. అంటే ఒక సినిమాని తీసేంతటి సమయాన్ని ట్రైలర్ కోసమే వెచ్చించారన్నమాట.

రాజమౌళి తనయుడు కార్తికేయ ట్రైలర్ టీమ్ కి నేతృత్వం వహించినట్టు తెలిసింది. వంశీ అనే ఓ యువ ఎడిటర్ ఆ ట్రైలర్ ని కట్ చేశాడట. మొత్తం 25 వెర్షన్లు కట్ చేయించి దాంట్లో ది బెస్ట్ అనిపించిన ఫైనల్ వెర్షన్ ని ఓకే చేశాడట రాజమౌళి. దీన్నిబట్టి ట్రైలర్ కోసం ఏ రేంజ్లో కసరత్తులు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్తాప్యంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. వాళ్లందరినీ ట్రైలర్ తోనే అబ్బురపరచాల్సిన ఓ ఛాలెంజ్ రాజమౌళిపై ఉంది. అందుకే ఒక బృందాన్ని ట్రయిలర్ కోసమే కేటాయించి ఆ పని విజయవంతంగా పూర్తి చేయించాడు. మామూలుగా అయితే సినిమా కోసం స్టోరీ బోర్డ్ వేసుకొంటుంటారు. కానీ రాజమౌళి టీమ్ మాత్రం ట్రైలర్ కోసం కూడా స్టోరీ బోర్డ్ వేసుకొన్నారట.

,  ,  ,  ,  ,