Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-May-2017 12:14:25
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు రాబోయే సినిమా స్పైడర్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ తొలిసారి గూఢచారి (స్పై) గెటప్ లో కనిపించనున్నాడనే సమాచారం అభిమానుల ఆసక్తిని మరింత పెంచింది. సమ్మర్ లోనే రావాల్సిన ఈ సినిమా బాగా డిలే అయింది. అనుకున్న సమయం కన్నా ఎక్కువసేపు షూటింగ్ చే్యాల్సి రావడంతోనే సినిమా లేటయిందని సమాచారం వచ్చింది.

ఈ విషయంలో మురుగదాస్ తీరుపై మహేష్ అసంతృప్తి వ్యక్తం చేశాడన్న టాక్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమా డిలే అవడానికి కారణం విజువల్ ఎఫెక్ట్స్ కోసం మరింత సమయం వెచ్చించాల్సి రావడమేనని తెలిసింది. స్పైడర్ సినిమా యూనిట్ విజువల్ ఎఫెక్ట్స్ పై ముందు పెద్దగా దృష్టి పెట్టలేదని సమాచారం. కానీ బాహుబలి-2 సినిమా చూశాక తమ అభిప్రాయం మార్చుకున్నారట. తాజా సమాచారం ప్రకారం.. బాహుబలి-2కి విజువల్ ఎఫెక్ట్స్ అందించిన స్టంట్ మాస్టర్ కణల్ కణ్నన్ మకుట టీం ను తమ సినిమాకు పనిచేయాల్సిందిగా స్పైడర్ టీం కోరింది. ఇందుకు అంగీకరించిన వారు ఓ కండిషన్ పెట్టారు. తమను కంగారు పెట్టకుండా కాస్త టైం ఇస్తే మంచి క్వాలిటీ అవుట్ పుట్ ఇస్తామని మకుట టీం చెప్పిందని టాక్. విజువల్ ఎఫెక్ట్స్ లో క్వాలిటీ లేకపోతే అభాసుపాలయ్యే ప్రమాదం ఉండటంతో చిత్ర యూనిట్ కూడా వారు అడిగిన టైం ఇవ్వడానికే సిద్ధమైంది.

ఈ లెక్కల ప్రకారం చూస్తే జూన్ 23కి స్పైడర్ రిలీజ్ అవడం కష్టమే. దీంతో ఈ సినిమా విడుదల వాయిదా వేయక తప్పని పరిస్థితి. ఆగస్టుకు లేదా సెప్టెంబర్ కు స్పైడర్ థియేటర్లలో అడుగు పెట్టే అవకాశముంది.

,  ,  ,  ,  ,