Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jun-2015 17:20:31
facebook Twitter Googleplus
Photo

బాహుబలి సినిమా ట్రైలర్ చూసిన వాళ్లంతా ఈ సినిమాని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించారనే విషయాన్ని గ్రహించారు. అయితే ఈ సినిమాకి ఒక హాలీవుడ్ సినిమాతో పోలిక ఉందనే మాటలు ముంబైలోని విలేకరుల సమావేశంలో వినిపించాయి. దాంతో చిత్రదర్శకుడు రాజమౌళి తనదైన శైలిలో స్పందించాడు. ఈ సినిమా హిందీ వెర్షన్ ప్రమోషన్లో భాగంగా నిన్న ముంబై చేరుకున్న రాజమౌళి, అక్కడి విలేకరుల సమావేశంలో మాట్లాడాడు.

ఈ సినిమా నిర్మాణం .. ప్రస్తుతం దక్కుతోన్న ప్రముఖుల ప్రశంసల గురించి ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే .. హాలీవుడ్లో అఖండ విజయాన్ని సాధించిన '300' చిత్రానికీ .. బాహుబలికి పోలికలు ఉన్నాయనే అభిప్రాయాన్ని అక్కడి విలేకరులు వ్యక్తం చేశారు. బాహుబలి ఓ ప్రత్యేకమైన చిత్రమనీ .. 300 చిత్రానికీ .. ఈ సినిమాకి ఎలాంటి పోలికలేదని రాజమౌళి అన్నాడు. ఇది సొంతంగా .. పకడ్బందీగా అల్లుకున్న కథనీ, హిందీ ప్రేక్షకులతో పాటు మిగతా దక్షిణాది ప్రేక్షకులందరినీ ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

,  ,  ,