Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Nov-2016 11:35:09
facebook Twitter Googleplus
Photo

యూనివర్సిల్ స్టార్ కమల్ హాసన్ - సీనియర్ నటి గౌతమి 13 ఏళ్ల బంధానికి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. కమల్ తో 13 ఏళ్లుగా చేస్తోన్న ప్రయాణాన్ని ఇకపై తాను కంటిన్యూ చేయలేనని గౌతమి తాజాగా తన బ్లాక్ ద్వారా చెప్పడంతో వీరిద్దరి బంధం కథ కంచికి చేరినట్లయ్యింది. అయితే ఇదే అంశంపై కమల్ కూడా ఈ రోజు స్పందించారని ఓ వార్త సోషల్ మీడియాలో జోరుగా హల్ చల్ చేస్తోంది.

అయితే ఈ అంశం కమల్ ను పెద్ద షాక్ కు గురి చేసింది. గౌతమితో తాను విడిపోయినట్టు తాను ఎక్కడా ఎవ్వరికి చెప్పలేదని...తాను ఎలాంటి ప్రకటనలు చేయలేదని... తాను ప్రకటన చేసినట్టు మీడియాలో వార్తలు రావడం దారుణమని కమల్ తెలిపారు. ఈ విషయంపై తన ట్వీట్టర్ లో కమల్ తమిళ లాంగ్వేజ్ లో ట్వీట్ చేశారు.

కమల్ తో విడిపోతున్నట్టు గౌతమి ప్రకటన చేసిన వెంటనే కమల్ కూడా ఇదే అంశంపై స్పందిస్తూ.... గౌతమితో తాను విడిపోతున్నట్టు చెప్పారన్న ఓ వార్త సోషల్ మీడియాలో వచ్చింది. దీనిని బేస్ చేసుకుని సౌత్ ఇండియా మీడియా చెలరేగి పోయి వార్తలు ప్రసారం చేసేసింది. వీరిద్దరు విడిపోవడానికి శభాష్ నాయుడు సినిమాతో పాటు శృతీహాసన్ - గౌతమి పొలిటికల్ ఎంట్రీ లాంటి అంశాలే కారణమని మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి.

ఈ వార్తలపై స్పందించిన కమల్ తాను ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదని చెప్పారు. తన పేరుతో ఎవరో ఈ ప్రకటన చేసి ఆటలాడుతున్నారని కూడా ఆయన ఫైర్ అయ్యారు. ఇది గౌరవప్రదం కాదని అన్న కమల్ దీనిపై తాను వ్యాఖ్యానించదలచుకోలేదని ట్వీట్ లో పేర్కొన్నారు. ఏదేమైనా ఈ విషయంలో కమల్ భిన్నంగా స్పందించడం ఇప్పుడు రకరకాల సందేహాలకు తావిస్తోంది.

,  ,  ,  ,  ,