Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-May-2015 10:54:39
facebook Twitter Googleplus
Photo

క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి కూడా కాపీ కొడుతున్నాడా? ఇప్పుడీ డౌటే టాలీవుడ్ లో చాలా మందికి వస్తోంది. దానికి కారణం, నిన్న 'బాహుబలి' సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టరే! ఆకట్టుకునేలా వున్న ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజమౌళి క్రియేటివిటీ ఈ పోస్టర్ లో కూడా కనపడుతోందని చాలా మంది కామెంట్ చేశారు. అయితే, ఆ తర్వాత సోషల్ మీడియాలో చాలా మంది 'ఇది కాపీ పోస్టర్' అంటూ విమర్శలు గుప్పించారు. 1998లో వచ్చిన హాలీవుడ్ సినిమా 'సైమన్ బర్చ్' పోస్టర్ కి ఇది కాపీ అంటూ ఆక్షేపణలు వెల్లువెత్తాయి. అయితే, హాలీవుడ్ సినిమా పోస్టర్ నుంచి స్పూర్తి పొందితే తప్పేమిటని వాదించే వారు కూడా వున్నారు. ఏమైనా, దీనిపై చర్చ మాత్రం బాగానే జరుగుతోంది!

,  ,  ,  ,  ,  ,  ,