Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Oct-2016 10:53:37
facebook Twitter Googleplus
Photo

దీపావళికి తెలుగు సినిమాల సందడి పెద్దగా ఉండట్లేదు. మంచు లక్ష్మి సినిమా లక్ష్మీబాంబు మినహా చెప్పుకోదగ్గ సినిమా ఏమీ వచ్చేలా లేదు. ఐతే ఓ తమిళ డబ్బింగ్ సినిమా మాత్రం భలే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆ సినిమానే.. కాష్మోరా. ఈ సినిమాపై తమిళంలో ఎలాంటి అంచనాలు ఉన్నాయో.. తెలుగులో కూడా అంతే హైప్ ఉంది. మధ్యలో కార్తికి తెలుగులో మార్కెట్ దెబ్బ తిన్నా.. ?ఊపిరి? సినిమాతో అతను మళ్లీ ఊపందుకున్నాడు. ఇలాంటి టైంలో ?కాష్మోరా? లాంటి క్రేజీ మూవీ చేయడం అతడికి కలిసొచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్.. ట్రైలర్ చూశాక తెలుగులోనూ అంచనాలు పెరిగిపోయాయి. డైరెక్ట్ తెలుగు మూవీ స్థాయిలో మంచి అంచనాల మధ్య భారీగా విడుదల చేయబోతున్నారు ఈ చిత్రాన్ని.

ముందు ?కాష్మోరా?ను ఈ నెల 29న రిలీజ్ చేయాలనుకున్నారు. ఐతే ఆ రోజు శనివారం కావడంతో తర్వాత డేట్ మార్చారు. ఒక రోజు ముందుకు తీసుకొచ్చి ఈ నెల 28నే సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ధనుష్ సినిమా కోడి (తెలుగులో ధర్మయోగి) ఆ తర్వాతి రోజే విడుదలవుతుంది. పీవీపీ వాళ్లు తమిళ.. తెలుగు భాషల్లో భారీ స్థాయిలో ?కాష్మోరా? విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. రూ.60 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ?కాష్మోరా?కు యువ దర్శకుడు గోకుల్ దర్శకత్వం వహించాడు. నయనతార.. దివ్యశ్రీ కథానాయకులుగా నటించారు. కార్తి ఇందులో మూడు రకాల విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విజువల్స్ హాలీవుడ్ సినిమాల్ని తలపిస్తున్నాయి. మగధీర.. బాహుబలి తరహాలో ఈ చిత్రం కూడా బలమైన ముద్ర వేస్తుందని భావిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,