Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Jun-2017 10:16:47
facebook Twitter Googleplus
Photo

ఎప్పటినుండో అందరూ వెయిట్ చేస్తున్న ఫస్ట్ లుక్ ఇంకెవ్వరిదో కాదు.. నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న ఆయన 101వ సినిమాదే. పూరి జగన్ డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పటినుండో పోర్చుగల్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో ఒక సరికొత్త షాకిచ్చాడు దర్శకుడు పూరి.

ఉస్తాద్.. జై బాలయ్య.. డాన్.. చకోరి.. వంటి ఎన్నో టైటిల్స్ విన్నాక.. అందులో కొన్ని చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయని అనుకున్నాక.. ఇప్పుడు సింపుల్ గా ఈ సినిమా పేరును ''పైసా వసూల్'' అని పెట్టేశారు. పూర్తిగా పెంచిన గెడ్డంతో పోర్చుగల్ లో తీసిన కొన్ని ఫైట్లలో స్టిల్స్ తో ఇప్పుడు ఫస్ట్ లుక్ ను బాలయ్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. లుక్స్ పరంగా బాలయ్య జస్ట్ ఓకె అనే చెప్పాలి. గతంలో డిక్టేటర్ సినిమాలో ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు తప్పించి.. కొత్తగా ఏమీ ప్రయత్నించలేదు. గెడ్డం ఒకటే కొత్త అట్రాక్షన్. అయితే ఇలా 'పైసా వసూల్' అనే సాదాసీదీ కామెడీ టైటిల్ ఎందుకు పెట్టాడో మాత్రం పూరి జగన్ కే తెలియాలి.

బాలయ్య బాక్సాఫీస్ దగ్గర పైసా వసూల్ చేయడంలో దిట్ట అని అందరికీ తెలుసుకదా.. అలాంటప్పుడు కొత్తగా ఆయనకు అలాంటి టైటిల్స్ ఎందుకు పూరి? నిజంగా ఏదన్నా పవర్ ఫుల్ టైటిల్ పెట్టుంటే ఈ 101వ సినిమాకు బాగా ప్లస్సేయేదేమో.

,  ,  ,  ,  ,