Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Apr-2016 13:11:41
facebook Twitter Googleplus
Photo

హిందీ బాహుబలిలో హీరో ప్రభాస్ పలికిన డైలాగులు విని థియేటర్లు మారుమోగాయి... అయితే తెలుగులో తన గంభీరమైన వాయిస్ తో అదరగొట్టే ప్రభాస్ హిందీలో కూడా అదరగొట్టాడా అనుకోవద్దు. అక్కడ ప్రభాస్ కు ఓ పవర్ ఫుల్ డైలాగ్ కింగ్ వాయిస్ అరువిచ్చారు. టీవీ సీరియల్ నటుడు శరద్ కేల్కర్ బాహుబలితో ప్రభాస్ కు స్వరం అరువిచ్చారు. అంతవరకు సాదాసీదాగా ఉన్న ఆయన కెరీర్ ఆ తరువాత స్పీడందుకుంది. బాహుబలి విడుదలయ్యాక మాత్రం అతని దశ - దిశలు మారిపోయాయి. బాలీవుడ్ లో శరద్ కేల్కర్ పేరు మార్మోగింది. ఇప్పుడు తెలుగు ఇండస్ర్టీలో భారీ సినిమాలో విలన్ పాత్రలో ఆయన కనిపించనున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'లో మెయిన్ విలన్ గా శరదే నటించాడు. తెలుగు హీరోకు గాత్రదానం చేసి మన్ననలు పొందిన శరద్ కు ఇదే మొదటి సినిమా. బుల్లితెరపై మంచి అనుభవం ఉన్నా కూడా వెండి తెరపై ఎంట్రీ మాత్రం ఇదే... మొదటి సినిమాయే పవర్ స్టార్ ది కావడంతో ఆయన ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

ఎంతో పెట్టిపుట్టుంటే తప్ప బాహుబలిలాంటి సినిమాలకు పనిచేసే అదృష్టం దొరకదని.. చాలా హిందీ సీరియల్సులో తన వాయిస్ విన్న కరణ్ జోహార్ - బాహుబలి హిందీ వెర్షన్ కు హీరోకు డబ్బింగ్ నువ్వేచెప్పాలన్నప్పుడు సంతోషంగా ఒప్పుకున్నానని శరద్ చెబుతున్నాడు. బాహుబలి 2 హిందీ వెర్షన్ కు కూడా ఆయనే డబ్బింగట. 'సర్దార్ గబ్బర్ సింగ్' విడుదల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నానని కేల్కర్ చెబుతున్నాడు.

మొత్తానికి హిందీలో మన హీరోలకు మంచి డైలాగ్ ఆర్టిస్టు.. తెలుగు సినిమాలకు కొత్త విలన్ శరద్ రూపంలో దొరికాడన్నమాట.

,  ,  ,  ,  ,