Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-May-2017 12:37:38
facebook Twitter Googleplus
Photo

బాహుబలి: ది కంక్లూజన్ సినిమాకు దేశవ్యాప్తంగా ఎలాంటి హైప్ వచ్చిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. భారతీయ సినీ చరిత్రలోనే ఏ సినిమా మీద లేనన్ని అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి. నార్త్.. సౌత్ అని తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. దేశవ్యాప్తంగా కనీ వినీ ఎరుగనంత భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు పెంచారు. అదనపు షోలు వేశారు. మిగతా రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల టికెట్ల రేట్లు పెంచారు. బాహుబలి-2 ఇండియాలోనే రూ.1000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం వెనుక ఇంత కథ ఉంది. బాహుబలి-2 లో కథాకథనాల సంగతలా ఉంచితే.. ఇందులోని విజువల్ గ్రాండియర్.. విజువల్ ఎఫెక్ట్స్.. భారీ యుద్ధ సన్నివేశాల కారణంగా ఒక్కసారైనా ఈ సినిమా చూడాలన్న భావన జనాల్లో కలిగింది.

ఐతే అమీర్ ఖాన్ సినిమా దంగల్ లో విజువల్ ఎఫెక్ట్స్ లేవు.. భారీతనం లేదు.. హీరోయిజం లేదు.. అమీర్ ఖాన్ చాలా మామూలుగా వ్యక్తిగా కనిపిస్తాడందులో. కేవలం కథాకథనాలే ఆ సినిమాకు ప్రాణం. బాహుబలి-2 కు ఉన్నట్లు భారీ హంగులేమీ లేవు దానికి. ఇక ఆ సినిమాకు బాహుబలి-2 స్థాయిలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ అంత క్రేజ్ లేదు. నార్త్ ఇండియాలో ఓకే కానీ.. సౌత్ లో ఈ సినిమాను సగటు హిందీ సినిమాల్లాగే రిలీజ్ చేశారు. విదేశాల్లో కూడా బాహుబలి-2 స్థాయిలో ఏమీ విడుదల కాలేదు. దీనికంత హైపూ లేదు. అమెరికాలో బాహుబలి-2 కు పెంచినట్లు విపరీతంగా రేట్లు పెంచి టికెట్లు అమ్మలేదు. అయినప్పటికీ బాహుబలి-2 కు దీటుగా వసూళ్లతో అదరగొట్టింది దంగల్-2. ఫస్ట్ రిలీజ్ లోనే దాదాపు రూ.800 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. తాజాగా చైనాలో విడుదలై రూ.300 కోట్ల మార్కు దిశగా దూసుకెళ్తోంది. అనేక హంగులు.. అదనపు ప్రయోజనాలతో ‘బాహుబలి-2’ రూ.1500 కోట్ల మార్కుకు చేరువవుతుంటే.. అమీర్ సినిమా కేవలం కంటెంట్.. అమీర్ అద్భుత నటనతో వరల్డ్ వైడ్ రూ.1200 కోట్ల మార్కు దిశగా అడుగులు వేస్తుండటం చిన్న విషయం కాదు.

,  ,  ,  ,  ,