Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jun-2016 16:53:24
facebook Twitter Googleplus
Photo

బాలయ్య రిక్షా తొక్కుతుంటే ఆయన్ని చూసి అయ్యో పాపం రామారావుగారి అబ్బాయికి ఎంత కష్టం వచ్చింది అనుకుందట ఆయనకు పిల్లనిచ్చిన అత్తగారు. ఈ సంఘటన గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర సంగతులు చెప్పాడు బాలయ్య. ??నేను చిన్నపుడు ?రామ్ రహీమ్? షూటింగ్ కోసం కాకినాడకు వెళ్లాను. కథానుగుణంగా నేను ఓ సన్నివేవంలో రిక్షా తొక్కాలి. ఎన్టీఆర్ గారి అబ్బాయిని కావడంతో జనం మేడలు.. మిద్దెలు ఎక్కి చూసేవాళ్లు. ఆ సమయంలో మా ఆవిడ వాళ్లమ్మ కూడా నన్ను చూశారట. అయ్యో రామారావుగారి అబ్బాయికి ఎంత కష్టమొచ్చింది.. రిక్షా తొక్కుతున్నాడే అనుకున్నారట. అప్పటికి వాళ్లకు మాకు ఏ సంబంధం లేదు. ఆశ్చర్యకరంగా వాళ్లింటికే నేను అల్లుడిగా వెళ్లాల్సి వచ్చింది. ఇదంతా విధి లిఖితం?? అన్నాడు

ఇక తన భార్య వసుంధర గురించి బాలయ్య మాట్లాడుతూ.. ??ఆమె పేరు వసుంధర. ఆ పేరు తగ్గట్లే ఓర్పు ఎక్కువే. మా అమ్మలో ఉన్న లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయనిపిస్తుంది. నేను షూటింగుల్లో బిజీగా ఉంటే ఇంటి దగ్గర పిల్లల ఆలనా పాలనా అన్నీ తనే చూసుకునేది. నేను విదేశాలకు షూటింగ్స్ కోసం వెళ్తే పనిలో పడి అన్నీ మరిచిపోయేవాణ్ని. ఐతే వసుంధరే అందరికీ వయసును బట్టి బహుమతులు కొనేది. ఇంటికి వచ్చాక నాన్న మీ కోసం ఏం తెచ్చాడో చూడండి అంటూ గిఫ్టులు పంచేది. నాకేదైనా సమస్య వస్తే పరిష్కారం వెతకడానికి తపిస్తుంది. నిజంగా వసుంధర నాకోసమే పుట్టిందేమో అనిపిస్తుంది. ఆమె నా భార్య కావడం నా అదృష్టం. ఆమె నా భార్య మాత్రమే కాదు. ఫ్రెండ్.. అడ్వైజర్. నేను చిన్నప్పట్నుంచి లెక్కల్లో పూర్. అందు వల్ల ఇంట్లో ఆర్థిక విషయాలు సహా అన్నీ తనే చూసుకుంటూ ఉంటుంది?? అని బాలయ్య చెప్పాడు.

,  ,  ,  ,  ,  ,