Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Apr-2016 15:40:14
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ?సర్దార్ గబ్బర్ సింగ్? సినిమా అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. అభిమానులను తప్ప సాధారణ ప్రేక్షకులను మెప్పించలేదన్న టాక్ తెచ్చుకున్నా కూడా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సినిమా దుమ్మురేపుతోంది. ఇక ఆ తర్వాత రోజు నుంచి కలెక్షన్స్ మెల్లిగాన్ నెమ్మదిస్తూ వస్తున్నాయి. కృష్ణా ఏరియాలో ఈ సినిమా మొదటి ఐదురోజుల్లో 2,51,28,437 షేర్ వసూళ్ళు సాధించింది.
ఐదోరోజైన మంగళవారం ఈ సినిమా 9,94,575 రూపాయలు వసూలు చేసింది. ఇక ఈ కలెక్షన్స్ ఊహించిన స్థాయిలో లేకపోయినా హాలీడే సీజన్‍లో కలెక్షన్స్ పుంజుకుంటాయన్న నమ్మకంలో టీమ్ ఉంది. పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శరత్ మరార్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. పవన్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటించగా, దేవిశ్రీ సంగీతం సమకూర్చారు

,  ,  ,  ,  ,  ,  ,