Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jan-2017 10:26:26
facebook Twitter Googleplus
Photo

క్యాథరీన్ త్రెసా.. దుబాయ్ నుండి వచ్చిన ఈ మల్లూ బ్యూటి.. తెలుగులో బాగానే సినిమాలు చేసింది. అయితే ఈ మధ్యకాలంలో అమ్మడికి అస్సలు బ్రేకిచ్చే ఛాన్సులే రానప్పుడు.. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ అనగానే అమ్మడి ఫేట్ మారుతుంది అనుకున్నారు అందరూ. కాని తరువాత అమ్మడు చిరంజీవి కూతురు సుస్మితతో డ్రస్సుల విషయంలో గొడవ పెట్టుకోవడంతో.. పాట నుండి తప్పుకోవాల్సి వచ్చింది.

ఇకపోతే ఇప్పుడు సెక్సీ బ్యూటి లక్ష్మీ రాయ్ పరిస్థితి చూసినోళ్లందరూ.. అసలు క్యాథరీన్ ఫ్రీ పబ్లిసిటీ అంతా మిస్సయిపోయింది అంటున్నారు. గతంలో బికినీల్లో మెరిసినా కూడా అసలు లక్ష్మీ రాయ్ గురించి డిస్కస్ చేసిన నాదుడే లేడు. కాని ఇప్పుడు రత్తాలు సాంగ్ ప్రభావంతో.. అమ్మడి గురించి న్యూ ఇయర్ కాలమ్న్స్ రాయడం.. ఎప్పుడూ ఈమె ఫోటోలపై చర్చలు జరపడం.. అలాగే దాదాపు రోజూ ఏదో ఒక న్యూస్ ఐటెంలో ఈమె గురించి కవర్ చేయడం వంటివి జరిగిపోతున్నాయ్. నిజానికి లక్ష్మీ రాయ్ లో అంత మ్యాటర్ ఉందా అంటే.. అంత సీన్ లేదు. కాకపోతే ఖైదీ నెం 150 అనే ప్రెస్టీజియస్ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తోంది కాబట్టే ఈ కవరేజ్ అంతా. అదే క్యాథరీన్ ఈ సాంగ్ చేసుంటే హ్యాపీగా బోలెడంత పబ్లిసిటీ వచ్చేది కదూ.

ఇప్పుడే ఇదే విషయంపై క్యాథరీన్ పిఆర్ యవ్వారాలు చూస్తున్న కొందరు తెలుగు సినిమా వాళ్లు తెగ ఫీలైపోతున్నారు. అనవసరంగా సుస్మితతో గొడవపెట్టుకుని క్యాథరీన్ మిస్సయ్యిందే అంటూ బాధపడుతున్నారు. ఒక్కోసారి అంతేలే!!

,  ,  ,  ,  ,  ,  ,