Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Feb-2016 14:02:58
facebook Twitter Googleplus
Photo

శ్రీకృష్ణుడు అనగానే నందమూరి తారకరామారావు గుర్తుకొచ్చినట్లే.. శ్రీకృష్ణదేవరాయలు అనగానే అందరికీ ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ తలపుల్లోకి వస్తాడు. ఒరిజినల్ కృష్ణదేవరాయలు ఎలా ఉంటాడో తెలియదు కానీ.. ?ఆదిత్య 369? సినిమాలో బాలయ్యను చూశాక మాత్రం కృష్ణదేవరాయలు ఇలాగే ఉంటాడని ఫిక్స్ అయిపోయారు జనాలు. అంత అద్భుతంగా ఆ పాత్రను పండించాడు బాలయ్య. మధ్యలో ఓసారి ఓ సినీ వేడుకలోనూ కృష్ణదేవరాయలు అవతారంలో దర్శనమిచ్చిన బాలయ్య.. తాజాగా మరోసారి ఆ రూపంలోకి మారబోతున్నాడు.

తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లాలో ఈ నెల 27 28 తేదీల్లో లేపాక్షి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయిస్తున్న బాలయ్య.. ఆ వేడుకల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో తన వంతు పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఆయన కృష్ణదేవరాయల అవతారం ఎత్తబోతున్నాడు. తనదైన శైలిలో పద్యాలు - పాటలు పాడి అలరించబోతున్నాడు. ఇందుకోసం బాలయ్య ఆల్రెడీ రిహార్సల్స్ కూడా మొదులపెట్టాడు. బాలయ్యకు పురాణాలన్నా చారిత్రక అంశాలన్నా చాలా మక్కువ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్య మరోసారి తన అభిరుచిని చాటుకుంటున్నాడు. లేపాక్షి ఉత్సావాల సందర్భంగా వారం రోజులు అక్కడే ఉండబోతున్నాడు బాలయ్య. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ వేడుకల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.

,  ,  ,