Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jul-2017 10:39:36
facebook Twitter Googleplus
Photo

శుక్రవారం విడుదలవుతున్న సినిమాల్లో హీరో గోపిచంద్ నటించిన గౌతమ్ నంద కూడా ఉంది. ఇప్పటివరకు ఈ మధ్య కాలంలో అస్సలు హిట్టే కొట్టలేదు ఈ హీరో. పైగా వరుసగా మాస్ సినిమాలు చేయడంతో ఆడియన్స్ కూడా ఇతగాడి మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుకే ఇప్పుడు రూటు మార్చి క్లాస్ స్టయిలిష్ హీరో గెటప్ వేసి తనను తాను ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాడు.

విషయం ఏంటంటే.. అప్పుడెప్పుడో చేసిన ఆడియో ఫంక్షన్ తప్పిస్తే ఇంతవరకు ఈ సినిమాకు సరైన ప్రమోషన్లే లేవు. రీజన్స్ తెలియవు కాని.. ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి సెకండ్ హీరోయిన్ క్యాథరీన్ తెగ కనిపిస్తోంది కాని.. అసలు మెయిన్ హీరోయిన్ మాత్రం రావట్లేదు. అవును.. ప్రమోషన్స్ కాదు కదా ఆడియో ఫంక్షన్ కు కూడా హన్సిక రానేరాలేదు. ఇప్పుడు అమ్మడు క్రొయేషియాలో తన స్నేహితులతో వెకేషన్లో ఉంది. మీరు సడన్ గా రిలీజ్ ప్లాన్ చేసుకుంటే నేనేం చేయను అనేసిందట. ఇక క్యాథరీన్ విషయానికొస్తే.. అమ్మడు ఎంతసేపూ నా గ్లామర్ లో డిఫరెంట్ రేంజు చూస్తారు అని చెప్పడం తప్పించి సినిమా గురించి పెద్దగా చెబుతోందేం లేదు. కాబట్టి సినిమా బజ్ పెంచడానికి ఆమె ఇంటర్యూలు పెద్దగా ఉపయోగపడట్లేదు.

ఇకపోతే ఆ మధ్యన గోపిచంద్ చేసిన జిల్ సినిమాలో కూడా ఇలాగే స్టయిలిష్ కంటెంట్ ఎక్కువైపోయి సబస్టాన్స్ లేకుండా పోయింది. దాని వలన ఇప్పుడు గౌతమ్ నంద సినిమాకు ఇంటిపేరుగా ఘట్టమనేని అంటూ మహేష్ వాళ్ళ ఇంటిపేరు వాడినా.. ఒంటిపేరుగా అత్తారింటికి దారేదిలో పవన్ పేరు వాడినా.. రావల్సినంత బజ్ రాలేదు.

,  ,  ,  ,  ,