Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jan-2017 12:17:19
facebook Twitter Googleplus
Photo

నందమూరి నటసింహం బాలకృష్ణ.. గౌతమిపుత్ర శాతకర్ణిగా ప్రేక్షకుల ముందుకు దూసుకువచ్చేస్తున్నారు. ఈ నెల 12న శాతకర్ణి విడుదల సందర్భంగా ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా పతాక ఆవిష్కరణ ఉత్సవాన్ని నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో వంద థియేటర్లలో ఒకేసారి ఈ పతాకోత్సవాన్ని నిర్వహించింది యూనిట్.

విశాఖపట్నంలోని జ్యోతి థియేటర్ లో పతాక ఆవిష్కరణకు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఇది కేవలం పతాక ఆవిష్కరణ కాదని.. శాతకర్ణి విజయానికి నాంది అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు బాలయ్య. తన స్పీచ్ లో భాగంగా.. మూవీలోని పలు డైలాగ్స్ చెప్పి అలరించారు బాలకృష్ణ. 'ఇక్కడ మా ఇంట్లో గదికి గోడలుంటాయి.. గొడవలుంటాయి.. ఇది మా ఇల్లంటూ కొట్టుకుంటా.. కానీ మధ్యలో ఇంకొకడు వచ్చి ఇది మా ఇల్లంటే ఎగరేసి నరుకుతాం.. సరిహద్దుల్లో స్మశానం నిర్మిస్తాం. మీ మొండేలా మా జెండాని ఎగరేస్తాం' అంటూ బాలకృష్ణ ఆవేశంగా చెప్పిన డైలాగ్ కి ఆ ప్రాంగణం అంతా దద్దరిల్లిపోయింది.

ఇలాంటి డైలాగులు ఇంకెన్నో సినిమాలో ఉంటాయని.. సినిమా అంతకంటే అద్భుతంగా ఉంటుందని చెప్పిన బాలయ్య.. 'మిత్రమా 12న చిత్రం విడుదల కాబోతోంది' అంటూ తన ప్రసంగానికి ముగింపు పలికారు.

,  ,  ,  ,  ,