Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Sep-2017 12:33:53
facebook Twitter Googleplus
Photo

వెంకటేష్ కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సినిమాల్లో మల్లీశ్వరి ఒకటి. అందులో ఏజ్ బార్ అవుతున్నా పెళ్లి కాని వ్యక్తి పాత్రలో వెంకీ అభినయం అందరినీ ఆకట్టుకుంది. స్టార్ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి వెంకీ ఆ పాత్ర చేశాడు. మామూలుగా స్టార్లెవరూ అలాంటి పాత్ర చేయడానికి ముందుకు రారు. వెంకీ ఆ పాత్ర చేశాక స్టార్ హీరోల ఆలోచనలు మారిపోయాయి. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ సైతం పెళ్లి కాని ప్రసాద్ తరహా పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే పైసా వసూల్ తో పలకరించిన బాలయ్య.. ప్రస్తుతం తమిళ సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో బాలయ్య నాలుగు పదుల వయసు దాటినా ఇంకా పెళ్లి కాని నడివయస్కుడి పాత్రలో కనిపించబోతున్నాడట. ఆ సమయంలో బాలయ్యకు నయనతార ఎదురవుతుందట. ఆమెతో ప్రేమాయణం నేపథ్యంలో ఒక ఆసక్తికర ఎపిసోడ్ ఉంటుందట. ఎప్పుడూ గంభీరమైన పాత్రలే చేసే బాలయ్య.. ‘పైసా వసూల్’లో భిన్నమైన క్యారెక్టర్ చేశాడు. బాలయ్య అలాంటి అల్లరి పాత్రను చేయడం అభిమానులకు కొత్తగా అనిపించింది. ఈ కోవలోనే తన ఇమేజ్ కు భిన్నమైన మరో పాత్రను రవికుమార్ సినిమాలో బాలయ్య చేస్తున్నాడట. ఇందులో బాలయ్య పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని సమాచారం. ఈ చిత్రానికి రత్నం కథ అందించాడు. సీనియర్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కంచె.. గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాల సంగీత దర్శకుడు చిరంతన్ భట్ మ్యూజిక్ చేస్తున్నాడు.

,  ,  ,  ,  ,  ,