Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Apr-2016 13:16:04
facebook Twitter Googleplus
Photo

టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రతి ఏడాది మోస్ట్ డిజైరబుల్ మెన్ ర్యాంకులను ప్రకటిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ లిస్ట్‌లో తమ హీరో ర్యాంక్‌ను చూసి అభిమానులు మురిసిపోవడం ప్రతిసారీ జరిగేదే! ఇక ఈ లిస్ట్‌ కోసం దేశవ్యాప్తంగా ఒక పోల్, దేశంలోని ప్రధాన నగరాల్లోనూ ప్రత్యేకంగా పోల్ నిర్వహిస్తారు. ఈ క్రమంలో హైద్రాబాద్ టైమ్స్ ఆధ్వర్యంలో పెట్టిన మోస్ట్ డిజైరబుల్ మెన్ హైద్రాబాద్ లిస్ట్‌లో మహేష్ మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
2011నుంచే సూపర్ స్టార్ మహేష్ దేశవ్యాప్తంగా టాప్ 5 లిస్ట్‌లో ఉంటూ వస్తున్నారు. ఇక అదే విధంగా హైద్రాబాద్ టైమ్స్ లిస్ట్‌లోనూ మహేష్ టాప్‌లోనే ఉంటూ వస్తున్నారు. 2015 సంవత్సరానికి సంబంధించి టైమ్స్ ప్రకటించిన ఈ హైద్రాబాద్ డిజైరబుల్ లిస్ట్‌లో ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రానాలు టాప్ 5లో ఉన్నారు. ఇక మరికొద్దిరోజుల్లో దేశవ్యాప్తంగా ఓ లిస్ట్‌ వెలువడనుంది. అందులో మన హీరోలు ఏయే స్థానాల్లో ఉంటారో చూడాలి.

,  ,  ,  ,  ,  ,  ,  ,