Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Mar-2015 11:12:11
facebook Twitter Googleplus
Photo

నందమూరి బాలకృష్ణ నటించే 99వ చిత్రానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 'లౌక్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. చిత్రం షూటింగును మే నెలలో ప్రారంభిస్తారని తాజా సమాచారం. కోన వెంకట్, గోపీమోహన్ రచన చేస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తాడు. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించే ఈ చిత్రానికి 'డిక్టేటర్' అనే పేరు నిర్ణయించారు. ఇందులో ఓ కథానాయికగా నయనతార నటిస్తుంది. ఇదిలా ఉంచితే, ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న 'లయన్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది.

,  ,  ,  ,  ,  ,  ,