Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Mar-2017 10:10:24
facebook Twitter Googleplus
Photo

బాషా నుండి కబాలి వరకు చాలా డాన్ సినిమాలను చూశాం. ఎన్టీఆర్ యుగంధర్ (డాన్) నుండి ప్రభాస్ బిల్లా వరకు కూడా తెలుగులో కూడా ఆ డాన్ కథలను చూసేశాం. అయితే వాటన్నింటికంటే డిఫరెంట్ డాన్ ను దించుతున్నాను అంటున్నాడు దర్శకుడు పూరి జగన్.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ 101వ సినిమాను డైరక్ట్ చేస్తున్నాడు పూరిజగన్. ఈ సినిమాలో బాలయ్య ఒక డాన్ పాత్రలో కనిపిస్తున్నాడట. ఈ విషయాన్ని కన్ఫామ్ చేసిన పూరి.. ఇప్పటివరకు వచ్చిన డాన్ సినిమాలు ఒక లెక్క.. ఇప్పుడు నేను చేస్తున్న డాన్ సినిమా ఒక లెక్క అంటున్నాడు. ఓ ఐదు రోజుల షెడ్యూల్ లో బాలయ్యతో మనోడు మంచి యాక్షన్ సీక్వెన్స్ తీశాడట. బాలయ్య కూడా చాలా సింపుల్ గా ఉంటూ బాగా కోపరేట్ చేశాడు అంటూ ఆయన్ను ఆకాశానికి ఎత్తేశాడు.

అయితే ఈ మధ్య కాలంలో పూరి తీసిన డాన్ సినిమాలు అనేకం వచ్చాయి. పోకిరిలో డానులు ఉన్నారు.. గోలిమార్ సినిమాలో హీరోయే డాన్ గా మారిపోయాడు.. బిజినెస్ మ్యాన్ లో హీరో ఒక డాన్.. దేవుడు చేసిన మనుషులు సినిమాలో బ్యాంకాక్ డాన్ ఉంటే మొన్న వచ్చిన ఇజం సినిమాలో జగపతి బాబు స్టయిలిష్ డాన్ గా మెరిశాడు. ఈ డాన్స్ అందరూ అంతగా అలరించలేదు.

,  ,  ,  ,  ,  ,