Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jul-2017 13:57:05
facebook Twitter Googleplus
Photo

దిల్ రాజు నిర్మించిన ఫిదా శుక్రవారమే విడుదల కాబోతోంది. ఎడతెరిపిలేని వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ముసురు పట్టుకొన్న సీజన్లో ఆ సినిమా వస్తోంది. శుక్రవారం లోపు వర్షాల జోరు తగ్గితే వరుణ్ సినిమాకి కాస్త మేలవుతుంది. అయినా వర్షాలేవీ మంచి సినిమాకి అడ్డుగా నిలవలేవు. చాలా చిత్రాలు భీకర వర్షాల్లో విడుదలైనా ఘనవిజయం సాధించాయి. అదే నమ్మకంతోనే దిల్ రాజు టీమ్ ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ముందు ఈ సినిమాకి శేఖర్ కమ్ముల ముసురు అనే టైటిల్ ఖరారు చేయాలనుకొన్నారట. కానీ దిల్ రాజు ఆ పేరొద్దని ఫిదా ఖరారు చేయించాడట. ఆ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు దిల్ రాజు. శేఖర్ కమ్ముల తన సినిమా ఇలా ముసురు వేళలోనే విడుదలవుతుందరనే ఆ పేరనుకొన్నాడేమో తెలియదు. ఆయన మనసులో ఉన్న టైటిల్ కి తగ్గట్టుగానే సినిమా విడుదల సమయంలో వర్షపు జల్లులు పడుతున్నాయి. కానీ సినిమా విషయంలో టీమ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. నిన్ననే నాగబాబుకి చూపించాడట దిల్ రాజు. సినిమాని అర్జంటుగా అన్నయ్యకి చూపిస్తానని ఆయన దిల్ రాజుతో చెప్పాడట. అంత బాగా నచ్చిందట నాగబాబుకి. అదే విషయాన్ని దిల్ రాజు మీడియాతో చెప్పుకొచ్చాడు. ఫిదాపై వరుణ్ తేజ్ కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు.

,  ,  ,  ,  ,  ,