Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Dec-2014 10:56:04
facebook Twitter Googleplus
Photo

యంగ్ హీరో నితిన్ తాను పవన్ కల్యాణ్ కి పెద్ద అభిమానినని ఎన్నోసార్లు చెప్పాడు. ఇప్పుడు ఏకంగా ఇదే విషయాన్ని తాను తాజాగా నటించిన 'చిన్నదాన నీ కోసం' సినిమాలో చెబుతున్నాడు. ఇందులో తాను పవన్ అభిమాని పాత్రను పోషించానని చెప్పాడు. 'తొలిప్రేమ' సినిమా చూసినప్పటి నుంచీ తాను పవన్ కు ఫ్యాన్ గా మారాననీ, ఆయన స్పూర్తితోనే సినిమాల్లోకి వచ్చాననీ, అందుకే తన ప్రతి సినిమాలో పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావన ఉంటుందనీ చెప్పాడు. ఈ నెల 25న రిలీజవుతున్న తన తాజా చిత్రం మంచి హిట్టవుతుందని అన్నాడు. ఈ 'చిన్నదాన నీ కోసం' ఆడియో డిస్క్ వేడుక తిరుపతిలో జరిగింది. ఆ సందర్భంగా పవన్ పట్ల తన అభిమానాన్ని అలా చాటుకున్నాడు.

,  ,  ,  ,