Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jun-2015 17:38:09
facebook Twitter Googleplus
Photo

ఒక వైపున బాహుబలి విడుదలకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. మరో వైపున ప్రదర్శన హక్కులకి సంబంధించిన లావాదేవీలు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా హిందీ వెర్షన్ కి సంబంధించి స్పెషల్ ప్రీమియర్ షో ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. హిందీ వెర్షన్ ని కరణ్ జోహార్ విడుదల చేస్తోన్న విషయం తెలిసిందే.


జూలై 10 వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తూ వుండగా, 9వ తేదీన హిందీ వెర్షన్ స్పెషల్ ప్రీమియర్ షోకి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ స్పెషల్ ప్రీమియర్ షోకి అమితాబ్ బచ్చన్ .. షారూఖ్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. మరికొంతమంది బాలీవుడ్ ప్రముఖులు కూడా రానున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ప్రీమియర్ షో చూసిన తరువాత వాళ్లు ఎలా స్పందిస్తారనేది చూడాలి.

,  ,  ,  ,