Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Oct-2016 10:28:26
facebook Twitter Googleplus
Photo

ప్రకాష్ రాజ్ కేవలం నటుడు కాదు. మంచి అభిరుచి ఉన్న నిర్మాత. సొంతంగా బేనర్ పెట్టి తమిళంలో మంచి మంచి సినిమాలు తీశాడు. ఆ తర్వాత దర్శకుడిగానూ అరంగేట్రం చేశాడు. కమర్షియల్ సక్సెస్ అందుకోకున్నా మంచి సినిమాలు తీశాడని పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయనలోని నటుడు.. నిర్మాత.. దర్శకుడు ముగ్గురూ కలిసి సినిమాలు చేస్తున్నారు. ఈ త్రిపాత్రాభినయం గురించి తనదైన శైలిలో ఓ విశ్లేషణ చేశాడు ప్రకాష్ రాజ్.

??ప్రస్తుతం నేను చాలా ఆసక్తికరమైన కెరీర్ సాగిస్తున్నాను. ప్రొడ్యూసర్ ప్రకాష్ రాజ్ అంటే డైరెక్టర్ ప్రకాష్ రాజ్ కు ఇష్టం. అతడితో సినిమాలు తీయడానికి ఇష్టపడతాడు. ప్రొడ్యూసర్ ప్రకాష్ రాజ్ కు యాక్టర్ ప్రకాష్ రాజ్ అండ ఉంది. నిర్మాతకు ఏమైనా అయితే ఆదుకోవడానికి అతను సిద్ధంగా ఉంటాడు. ఈ యాక్టర్ ప్రకాష్ రాజ్ కు.. డైరెక్టర్ ప్రకాష్ రాజ్ తో పని చేయడం చాలా ఇష్టం. చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇలా ఈ ముగ్గురూ ఒకరికొకరు సహకరించుకుని సినిమాలు చేస్తున్నారు?? అంటూ ఓ ఇంటర్వ్యూలో విశ్లేషించాడు ప్రకాష్ రాజ్.

దర్శకుడిగా మారానంటే తనకేదో అన్నీ తెలిసిపోయాయని కాదని.. ఇన్నాళ్లూ తాను నేర్చుకున్నదాన్ని తన శైలిలో చెప్పడానికి ప్రయత్నిస్తున్నానని ప్రకాష్ రాజ్ చెప్పాడు. దర్శకుడిగా తన గత సినిమాలతో పోలిస్తే.. ?మనవూరి రామాయణం? సరైన రీతిలో రిలీజవుతోందని.. ఈ సినిమాతో మంచి ఫలితాన్ని అందుకుంటానన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ సినిమాకు ఎలాంటి ఫలితం వచ్చినప్పటికీ.. తన ప్రయత్నం ఆగబోదోని కూడా స్పష్టం చేశాడు ప్రకాష్ రాజ్.

,  ,  ,  ,  ,