Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jan-2017 10:30:12
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ కి పరమ భక్తుడిని అని చెప్పుకోవడానికి నిర్మాత బండ్ల గణేష్ ఏ మాత్రం సందేహించడు. తన భక్తిని అందరి ముందు చాటడానికి కూడా ఆలోచించడు. పవర్ స్టార్ నా దేవుడు అని చెప్పే బండ్ల గణేష్.. తాజాగా పెట్టిన ఓ ట్వీట్ ఆసక్తిని కలిగిస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ తో కలిసి తను దిగిన ఒక ఫోటోను పోస్ట్ చేసిన బండ్ల గణేష్.. 'బండ్ల ఈజ్ బ్యాక్ విత్ బాస్' అంటూ ట్వీట్ పెట్టాడు.

ఫోటో కంటే ఈ ట్వీట్ పైనే ఎక్కువ చర్చ నడుస్తోంది. క్యాజువల్ గా కలిస్తే ఆ ఫోటోను ట్వీట్ చేసుకోవడం వేరు.. కానీ బండ్ల ఈజ్ బ్యాక్ విత్ బాస్ అంటూ ట్వీట్ పెట్టడమే అసలు టాపిక్. బండ్ల గణేష్ కి పవన్ మరోసారి ఛాన్స్ ఇచ్చాడా? పవర్ స్టార్ తో సినిమాను బండ్ల గణేష్ నిర్మించనున్నాడా? లాంటి సందేహాలు అన్నీ మొదలైపోయాయి. ఒకవేళ నిజమే అయితే.. ఇప్పటికిప్పుడు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశాలు ఎన్ని ఉన్నాయి.. అని కూడా లెక్కలు వేసేస్తున్నారు. ప్రస్తుతం కాటమరాయుడు ఫినిష్ చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత ఏఎం రత్నం నిర్మాణంలో నీసన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది.

ఇది కాక త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోయే చిత్రాన్ని కూడా పవన్ మొదలుపెట్టాలి. దీన్ని హారిక హాసిని బ్యానర్ పై నిర్మించనున్నారు. మరి పవన్-బండ్ల గణేష్ కాంబినేషన్ సాకారం అయ్యేదెప్పుడు? ఆ ప్రాజెక్టును ఎవరు హ్యాండిల్ చేయబోతున్నారు? మళ్లీ పవన్ క్యాంప్ లోకి బండ్ల ఎంటర్ అయ్యాడా? లాంటివన్నీ ఇప్పటికైతే ప్రశ్నలే.. సమాధానాల కోసం మరికొన్నాళ్లు ఆగక తప్పదు.

,  ,  ,  ,