Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jul-2016 14:54:07
facebook Twitter Googleplus
Photo

హైదరాబాద్: బాబాయ్, అబ్బాయిలు ఇద్దరూ కలిసి ఓ సినిమాలు నటిస్తారంటే క్రేజే. అక్కినేని కుటుంబం అంతా కలిసి మనం చిత్రం చేసాక...దగ్గుపాటి ఫ్యామిలీ సైతం అటువంటి చిత్రం తాము కూడా చేస్తే బాగుంటుందని భావించింది. అయితే అప్పట్లో వర్కవుట్ కాలేదు. కానీ ఇప్పుడు ఆ దిశగా చేసిన ప్రయత్నం ఓ కొలిక్కి వచ్చినట్లు కనపడుతోంది. 'క్షణం' చిత్రంతో హిట్ కొట్టిన రవికాంత్ పేరేపు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో స్క్రిప్టు వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్టు వర్క్ పూర్తిగా అయ్యాక బాబాయ్, అబ్బాయిలు ఇద్దరూ ఒకేసారి విని ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ లైన్ కు సురేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం రానా..బాహుబలి 2 బిజీలో ఉన్నారు. దాంతో పాటు రానా హీరోగా నటించిన 'ఘాజీ' చిత్రం కోసం ఆయన అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ రెండు వెర్షన్స్ కి సంబంధించిన డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు వున్నారు.
భారీ నిర్మాణ విలువలతో జనవరిలో ప్రారంభమైన ఈ సినిమా కథానుసారం నీటి లోపల ఒక ప్రధానమైన యుద్ధ ఘట్టం కూడా చిత్రీకరించారు. ఇప్పటికే సర్టిఫైడ్ డైవర్ అయిన రానా ఈ పీరియడ్ డ్రామా కోసం ప్రత్యేకించి "అండర్ వాటర్" పాఠాలేమీ నేర్చుకోలేదు కానీ, కొద్దిగా రిహార్సల్స్ చేశారు. ఇండో - పాక్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కే సినిమా కావడంతో, సహజత్వం కోసం కొంతమంది పాకిస్తాన్ రంగస్థల నటులను కూడా తీసుకున్నారట.ఈ సినిమాలో రానా నేవీ ఆఫీసర్ గా నటించాడు. ఈ పాత్రలో సహజత్వాన్ని తీసుకురావడానికి ఆయన సీనియర్ నేవీ అధికారుల సలహాలను .. సూచనలను తీసుకుని ఈ పాత్రను పోషించడం విశేషం. 1971లో జరిగిన భారత - పాకిస్థాన్ యుద్ధంలో మనపై దాడికి వచ్చిన పాకిస్థాన్ జలాంతర్గామి "పి.ఎన్.ఎస్. ఘాజీ ని విశాఖపట్నం సముద్రతీరంలో భారతీయ సైనికులు తెలివిగా ముంచి వేశారు. ఆ ఘట్టాన్ని నేపథ్యంగా తీసుకొని చేస్తున్న సినిమా ఘాజీ . ఈ చిత్రంలో కోస్ట్ గార్డ్స్‌లో ఎస్-21 అనే నౌకాదళ అధికారి పాత్రను రానా పోషిస్తున్నారు. ఇది ఒక అద్భుతమైన వాస్తవ కథ

,  ,  ,  ,  ,  ,  ,