Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Nov-2016 11:22:09
facebook Twitter Googleplus
Photo

సినిమాకు భాషాబేధం లేదనికధకు కనెక్ట్ అయితే ఎక్కడైనా కోట్ల వర్షం కురిపించచ్చని హాలీవుడ్ చిత్రం 'ది జంగిల్ బుక్' నిరూపించింది. చిన్నా పెద్దా ప్రతీఒక్కరూ ఇరగబడి చూసేయడంతో ఈ సినిమాకి ఇండియాలో రికార్డు కలెక్షన్లు సొంతమయ్యాయి. ఇప్పుడు వచ్చే ఏడాది అటువంటి సినిమానే మరొకటి సిద్ధపడుతుంది.

అందమైన అమ్మాయి - భయంకరమైన జంతువుకి మధ్య సాగే ప్రేమాయణం కాన్సెప్ట్ తో తెరకెక్కించిన బ్యూటీ అండ్ బీస్ట్ అనే యానిమేటెడ్ మూవీ అప్పట్లో ఒక సంచలనం. ఈ సినిమా హిట్ అవ్వడంతో కామిక్ సిరీస్ లు - సీరియళ్లు చాలానే వచ్చాయి. ఇప్పుడీ ఫాంటసీ సబ్జెక్టుని లైవ్ గ్రాఫిక్స్ పధ్ధతిలో తెరకెక్కించి మరోసారి మనముందుకు తీసుకురానున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ అందరినీ ఆకర్షిస్తుంది. ఎమ్మా వాట్సన్ - డాన్ స్టీవెన్స్ ప్రధానపాత్రధారులు. ఓటీవల శంకర్ విక్రమ్ ల కలయికలో వచ్చిన 'ఐ' సినిమాలో ఒక పాటకి ఈ పాత్రలే స్ఫూర్తి. ఈ హాలీవుడ్ చిత్రం వచ్చే ఏడాది మార్చ్ 17న విడుదలకానుంది.

,  ,  ,  ,  ,