Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Oct-2016 15:39:29
facebook Twitter Googleplus
Photo

ఏడాదికి షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ హీరో మహా అయితే రెండు సినిమాలు చేయగలడు. సినిమాకు రూ.50 కోట్లు పారితోషకంగా తీసుకున్నా.. రూ.100 కోట్ల ఆదాయం ఉండాలి. కానీ షారుఖ్ ఈ ఏడాదికి రూ.230 కోట్ల దాకా సంపాదిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ టీం ద్వారా.. ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం మరీ భారీగా ఏమీ లేదు. మరి అంత డబ్బు అతను ఎలా సంపాదించేస్తున్నాడు అంటే.. ప్రకటనలు.. లైవ్ షోల ద్వారానే. ప్రకటనలైనా.. లైవ్ షోలైనా.. ఇంకేదైనా ప్రచార కార్యక్రమాలైనా.. ఒక్క రోజు షారుఖ్ కాల్ షీట్ కేటాయించాలంటే రూ.4 కోట్లు పారితోషకంగా తీసుకుంటాడట. ఈ మధ్య షారుఖ్ సినిమాలు వరుసగా ఫెయిలవుతున్నా సరే.. అడ్వర్టైజ్మెంట్ రంగంలో అతడికి ఢోకా లేదు. ఇండియాలో అతడికున్నంత డిమాండ్ మరే హీరోకూ లేదు.

ప్రస్తుతం షారుఖ్ చేతిలో పదికి పైగా బ్రాండ్లున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త బ్రాండ్లు వస్తూనే ఉన్నాయి. టీవీ పెట్టి రిమోట్ నొక్కుతూ పోతే ఎక్కడో ఓ చోట షారుఖ్ కనిపించకమానడు. ఒక చోట పెయింట్ డబ్బా పట్టుకుని ?నెరోలాక్? బ్రాండు గురించి చెబుతుంటాడు. ఇంకో చోట ?డిష్ టీవీ? ఎంత బెస్టో వివరిస్తుంటాడు. మరోచోట ఫ్రూటీ డ్రింక్ తాగి తన్మయత్వానికి లోనవుతుంటాడు. అంత పెద్ద స్టార్ అయినా సరే.. కోట్లిస్తాం మా పెళ్లిలో డ్యాన్స్ చేయమంటే మొహమాట పడడు షారుఖ్. అందుకే అతడి ఆదాయం అంత భారీగా ఉంటోంది. అసలు బాలీవుడ్డోళ్లకు ప్రకటనలు చేయడం ద్వారా భారీగా సంపాదించవచ్చని తెలియజెప్పిందే షారుఖ్. సినిమాల్లో ఇప్పుడతను బాద్ షా కాకపోవచ్చు కానీ.. అడ్వర్టైజ్మెంట్ రంగంలో మాత్రం అతడే కింగ్. అందులో సందేహం లేదు.

,  ,  ,  ,  ,  ,  ,