Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jun-2015 11:45:53
facebook Twitter Googleplus
Photo

'బెంగాల్ టైగర్' సినిమా టైటిల్ ను బట్టే హీరో ఎంత రఫ్ గా ఉంటాడో .. ఆయన క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అర్థమైపోతుంది. అలాంటి బెంగాల్ టైగర్ ప్రస్తుతం హైదరాబాదు .. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత రాధామోహన్ .. దర్శకుడు సంపత్ నంది మాట్లాడారు.

రామ్ లక్ష్మణ్ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామనీ, ఫాంటమ్ కెమేరాతో చిత్రీకరిస్తున్న ఈ దృశ్యాలు ప్రేక్షకులను ఎంతగానో థ్రిల్ చేస్తాయని అన్నారు. ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా ఈ యాక్షన్ ఎపిసోడ్ నిలుస్తుందని చెప్పారు. జూలై మొదటివారం వరకూ ఇక్కడ షూటింగ్ చేస్తూనే ఉంటామనీ, 20 వ తేదీన బొమన్ ఇరానీ జాయిన్ అవుతారని చెప్పారు. రవితేజా స్టైల్ .. తమన్నా - రాశీఖన్నా గ్లామర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

,  ,  ,  ,