Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-May-2016 17:42:34
facebook Twitter Googleplus
Photo

మా ఫ్యామిలీ అంతా ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాం. మాలో అందరికంటే చిన్న పిల్ల తనే. క్యూట్ లిటిల్ ప్రిన్సెస్. ఇప్పుడు చూడండి.. తెరమీద ఇరగదీస్తోంది. ఎంతో ప్రౌడ్ మూమెంట్ ఇది'' అంటున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. మనోడు తన సిస్టర్ నిహారిక కొణిదెల ''ఒక మనసు'' టీజర్ చూసి ఫుల్ ఫ్లాట్ అయిపోయాడట.

''నిహారిక ఇరగదీసింది. ఒక డెబ్యూ సినిమాలో అంతకంటే ఎవరు ఏం చేస్తారు చెప్పండి? చాలా ఇంప్రెసివ్ గా ఉంది. నిహాను అలా చూస్తే చాలా హ్యాపీగా ఉందని నాకు చరణ్ అన్న ఫోన్ చేసి చెప్పాడు. మా అందరి సపోర్టుతో... తను ఎప్పుడు తొలి రిలీజ్ ను చూస్తుందా అని ఎదురుచూస్తున్నాం'' అన్నాడు వరుణ్. అంతే కాదు.. అసలు మెగా ఫ్యామిలీ అంతా కూడా తమ ఫ్యామిలీ నుండి వస్తున్న తొలి హీరోయిన్ కాబట్టి.. ఎలా ఇంప్రెస్ చేస్తుంది అనే టెన్షన్ లో ఉన్నారట. కాని ఇప్పుడు ఫుల్ హ్యాపీ అయిపోయారట.

మే 18న ఒక మనసు ఆడియో లాంచ్. అయితే కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి వస్తారో రారో తెలియదు కాని.. యంగ్ హీరోలు.. చరణ్ బన్నీ వరున్ తేజ్ సాయిధరమ్ మాత్రం వస్తున్నారట. తమ కజిన్ ను వారే లాంచ్ చేస్తారట. అది సంగతి.

,  ,  ,  ,  ,  ,