Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jul-2016 16:08:49
facebook Twitter Googleplus
Photo

సైమా 2016 అవార్డుల తొలిరోజు చాలా ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవికి ఘనంగా వెల్కమ్ చెబుతూ సైమా ఫుల్లుగా కిక్కిచ్చింది. బెస్ట్ యాక్టర్ గా మహేష్ బాబు ?శ్రీమంతుడు? పెర్ఫామెన్సుకు గాను అవార్డును అందుకుంటే.. ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును అల్లు అర్జున్ అందుకున్నాడు. గోన గన్నారెడ్డిగా ?రుద్రమదేవి?లో మనోడు ఇచ్చిన అద్భుతమైన ప్రదర్శను విమర్శకులను సైతం ఎలా కట్టిపాడేసిందో ఇది చూసి తెలుసుకోవచ్చు.
ఇక అమ్మాయిల విషయానికొస్తే.. ?శ్రీమంతుడు?లో హీరోను మోటివేట్ చేసే విలేజ్ గాళ్ గా శృతి హాసన్ ఇచ్చిన ప్రదర్శనకే ఎక్కువమంది ఓటేశారు. అందుకే ఆ అవార్డు ఆమెనే వరించింది. బెస్ట్ యాక్టర్ (ఫిమేల్) ట్రోఫీ అందుకున్న శృతి ఆనందానికి హద్దుల్లేవనుకోండి. మరి క్రిటిక్స్ ఛాయిస్ ఉత్తమ నటి దగ్గరకు వస్తే.. ?రుద్రమదేవి?కి గాను అనుష్క ఆ అవార్డును అందుకుంది.
బాహుబలి సినిమాకు ఉత్తమ సినిమా.. రాజమౌళి బెస్ట్ డైరక్టర్.. దేవిశ్రీప్రసాద్ (శ్రీమంతుడు) బెస్ట్ మ్యూజిక్ అవార్డులను అందుకున్నారు. ఈ ఏడాది సైమా అవార్డుల్లో బాహుబలి సినిమాకు 7 అవార్డుల రాగా.. శ్రీమంతుడుకి కూడా 6 అవార్డులు వచ్చాయి

,  ,  ,  ,  ,  ,  ,