Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-May-2017 14:39:33
facebook Twitter Googleplus
Photo

సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే గొప్ప సినిమాగా పేరు తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ గా మాత్రం పెద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. ఇలా ఏదైనా సినిమా పెద్ద ఫ్లాపైతే.. దానికి సంబంధించి నెగెటివ్ సెంటిమెంట్లు పుట్టుకురావడం సహజం. ఆ సినిమా షూటింగ్ జరిపిన చోటుకు మళ్లీ వెళ్లకపోవడం.. ఆ కాంబినేషన్లను రిపీట్ చేయకపోవడం జరుగుతుంటుంది. ఐతే మహేష్ బాబు మాత్రం ఇలాంటివేమీ పట్టించుకోవట్లేదు. 1 నేనొక్కడినే షూటింగ్ జరిగిన లండన్ కు అతను మళ్లీ వెళ్లబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ మొదలుపెట్టిన కొత్త సినిమా భరత్ అను నేను షూటింగ్ కొంత భాగం లండన్ లో జరగనుండటం విశేషం.

భరత్ అను నేను లో మహేష్ రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడు. బేసిగ్గా అతను లండన్లో స్థిర పడ్డ ఎన్నారై బిజినెస్ మ్యాన్. అక్కడి నుంచి తెలుగు రాష్ట్రంలోకి అడుగుపెట్టి.. ఇక్కడ పొలిటీషియన్ అవుతాడు. సీఎం కుర్చీ కూడా ఎక్కుతాడు. రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు వరకు కథంతా లండన్ నేపథ్యంగానే సాగుతుంది. ఈ ఎపిసోడ్ ను ముందుగా చిత్రీకరించబోతున్నారు. జూన్ లోనే ఆ షెడ్యూల్ ఉంటుంది. ప్రస్తుతం స్పైడర్ పని ముగించడంలో బిజీగా ఉన్న మహేష్.. అదవ్వగానే భరత్ అను నేను షూటింగ్ కోసం లండన్ బయల్దేరుతాడు. ఐతే మహేష్ రావడానికంటే ముందే ఈ సినిమా షూటింగ్ మొదలైపోయింది. వేరే నటీనటుల కాంబినేషన్లో కొరటాల కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ప్రణాళికల్లో ఉంది చిత్ర యూనిట్.

,  ,  ,  ,  ,  ,