Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Nov-2016 11:29:47
facebook Twitter Googleplus
Photo

గత రెండేళ్లలో నాని రేంజి అమాంతం పెరిగిపోయింది. ?భలే భలే మగాడివోయ్? సినిమాతో స్టార్ హీరోల స్థాయిలో వసూళ్లు రాబట్టాడు నాని. జెంటిల్మన్.. మజ్ను లాంటి ఏవరేజ్ కంటెంట్ ఉన్న సినిమాలు కూడా హిట్టయ్యాయంటే అందుకు నానీనే కారణమంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు నాని మీద ఈజీగా 15 కోట్ల దాకా బడ్జెట్ పెట్టేయొచ్చు. బిజినెస్ రూ.20 కోట్ల దాకా వర్కవుట్ అయిపోతోంది. అందుకే ఇప్పుడు నాని సినిమాలపై బాగానే ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు. దిల్ రాజు నిర్మిస్తున్న ?నేను లోకల్?కు కూడా బాగానే ఖర్చు పెడుతున్నారు. ఇక నాని చేయబోయే తర్వాతి సినిమాకు అతడి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ పెడుతున్నట్లు సమాచారం.

కొత్త దర్శకుడు శివశంకర్ దర్శకత్వంలో నాని చేయబోయే సినిమాకు రూ.20 కోట్ల దాకా బడ్జెట్ కేటాయించారట. ఈ సినిమాలో చాలా భాగం ఫారిన్లోనే షూటింగ్ చేస్తారట. ఇప్పటిదాకా నాని సినిమాలన్నీ లోకల్ లొకేషన్లలోనే షూటింగ్ జరుపుకున్నాయి. అతడి కొత్త సినిమా కథ చాలా వరకు ఫారిన్ నేపథ్యంలోనే సాగుతుందట. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఇందులో కోన వెంకట్ కూడా నిర్మాణ భాగస్వామి అని సమాచారం. ?జెంటిల్మన్? భామ నివేదా థామస్ కథానాయికగా నటించబోయే ఈ చిత్రం జనవరిలో సెట్స్ మీదికి వెళ్తుంది. ?నేను లోకల్? డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో కూడా నాని ఓ సినిమా కమిటయ్యాడు. గౌతమ్ మీనన్ కూడా నానితో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు.

,  ,  ,  ,  ,